సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: మోపుల చిగురుల
టైటిల్: మోపుల చిగురుల
పల్లవి:
ప|| మోపుల చిగురుల చిమ్ములవేదము | ఆవుల మందలలోని ఆవేదము ||
చరణం:చ|| మంచముపై చదివేది మరవకుమీ | కొంచెపు లేబలుకుల కొనవేదము |
పించపు శిరసుతోడ బిన్ననాడే చదివిన | తుంచి తుంచిన మాటల తొలివేదము ||
చ|| చల్లలమ్మే గొల్లెతల చక్కని జంకెనలకు | గొల్లపల్లెలోన దొరకొన్న వేదము |
తల్లి బిడ్డ లనక యందరి నొక్క వావిగా | పిల్లగ్రోవి నేరిపిన పెనువేదము ||
చ|| పంకజభవాదులు బడిబడి జదివించే | లంకెలు చెలగిన మెలపువేదము |
వేంకటనగము మీద వెలయు నిందిరగూడి | కొంకొక చదివిన చొక్కుల వేదము ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం