సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: మొఱపెట్టెదము
టైటిల్: మొఱపెట్టెదము
పల్లవి:
ప|| మొఱపెట్టెదము మీకు మొగసాలవాకిటను | మఱగుచొచ్చితి మీకు మము గావరో ||
చరణం:చ|| యేపున మనసనియేటిమాపెంపుడు లేడి | పాపమనేయడవి బడినది |
రాపున హరికింకరపువేకకాండ్లాల | పైపైని మాకింక బట్టియ్యరో ||
చ|| అంచెల మావిజ్ఞానమనెడి కామధేనువు | పంచేంద్రియపు రొంపి బడినది |
మించి వైకుంఠానకేగే మేటితెరువరులాల | దించక యెత్తెత్తి వెళ్ళదియ్యరో ||
చ|| అండనే మోహాంధకారమనెడి మాదిగ్గజము | దండి మీదయయనేటివో దాన బడెను |
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం