సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: మరచితిమంటే
టైటిల్: మరచితిమంటే
పల్లవి:
ప|| మరచితిమంటే మరిలేదు | తరితో దలచవో దైవము మనసా ||
చరణం:చ|| పుట్టుచునున్నది పోవుచునున్నది | పట్టపు జీవుల ప్రపంచకము |
నట్టనడుమనే హరినామము | గుట్టున దలచవో కొనగొని మనసా ||
చ|| పొద్దు వొడుచు నదె పొద్దు గుంకు నదె | తిద్దిన జగముల దిన దినము |
అద్దపు నీడల అంతర్యామిని | వొద్దనె తలచవొ ఒనరగ మనసా ||
చ|| లోపల వెలుపల లోగొని ఉన్నది | శ్రీపతి మహిమల సృష్టి యిదే |
యేపున శ్రీ వేంకటేశ్వరు డితడే | దాపని నమ్ముచు దలచవొ మనసా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం