సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: మరిగి వీరెపో
టైటిల్: మరిగి వీరెపో
పల్లవి:
ప|| మరిగి వీరెపో మాదైవంబులు | కెరలిన హరిసంకీర్తనపరులు ||
చరణం:చ|| వినియెడివీనులు విష్ణుకథలకే | పనిగొందురు మాప్రపన్నులు |
కనియెడి కన్నులు కమలాక్షునియం- | దనువుపరతు రటు హరిసేవకులు ||
చ|| పలికెడి పలుకులు పరమాత్మునికై | యలవరుతురు శరణాగతులు |
తలచేటి తలపులు ధరణీధరుపై | తలచెడి రతిదివ్యులు ||
చ|| కరముల శ్రీపతికైంకర్యములే | మురియుచు జేతురు ముముక్షువులు |
యిరవుగ శ్రీవేంకటేశ్వరుమతమే | సిరుల నమ్ముదురు శ్రీవైష్ణవులు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం