సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: మఱియు మఱియు
టైటిల్: మఱియు మఱియు
పల్లవి:
ప|| మఱియు మఱియు నివె మాపనులు | మెఱసితి మిందే మిక్కిలివి ||
చరణం:చ|| నారాయణునకు నమస్కారము | ధారుణీపతికిని దండము |
శ్రీరమణునకును జేరి శరణ్యము | వారిధిశాయికి వరుస జోహారు ||
చ|| రామకృష్ణులకు రచనలబంటను | దామోదరునకు దాసుడను |
వామనమూర్తికి వాకిటిగొల్లను | సోమార్కనేత్రునిసొరిదిలెంకను ||
చ|| గోవిందునికే కొలువులు సేతుము | దేవోత్తముబడి దిరుగుచును |
భావజగురునకు పంపునడతుము | శ్రీవేంకటపతి సేవింతుము ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం