సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: మరుడు సేసిన
టైటిల్: మరుడు సేసిన
పల్లవి:
ప|| మరుడు సేసిన మాయ మగలకు నాండ్లకు | విరసాలు పుట్టవు వేడుకే కాని ||
చరణం:చ|| యెంత దూరి మాటాడినా యింపులయ్యే వుండుగాని | పంతము రేగ దింతిపై బతికి |
పొంత నుండి సారె బొమ్మల జంకించినాను | వింతలు దోచవు మరి వేడుకే గాని ||
చ|| చలపట్టి సరసము జరయుచు నాడినాను | అలయిక పుట్టదు దేహమునకును |
పెలుచుదనాన మరి పెనగులా టాడినాను | వెలయ వేసట గాదు వేడుకే కాని ||
చ|| మిన్నక కొసరి మందెమేళ మెంత సేసినాను | అన్నిటాలోలో నెగ్గులై మించవు |
యెన్నగ శ్రీ వేంకటేశుడే నలమేలు మంగను | విన్నప్పుడే కూడె మాకు వేడుకలె కాని ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం