సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ముచ్చుగన్నతల్లి
టైటిల్: ముచ్చుగన్నతల్లి
పల్లవి:
ప| ముచ్చుగన్నతల్లి చేరి మూలకు నొదిగినట్టు | తెచ్చినసంబళమెల్ల దీరుబో లోలోనె ||
చరణం:చ|| దప్పముచెడినవానితరుణి కాగిట జేరి | అప్పటప్పటికి నుస్సురనినయట్టు |
వొప్పయినహరిభక్తివొల్లని వానియింటి- | కుప్పలైనసంపదలు కుళ్ళుబో లోలోనె ||
చ|| ఆకలిచెడినవాని అన్నము కంచములోన | వోకిలింపుచు నేల నొలికినట్లు |
తేకువైనహరిభక్తి తెరువుగాననివాని- | వేకపుసిరులు కొంపవెళ్ళుబో లోలోనె ||
చ|| వొడలుమాసినవాని వొనరుజుట్టములెల్ల | బడిబడినే వుండి పాసినయట్టు |
యెడయక తిరువేంకటేశు దలచనివాని- | అడరుబుద్ధులు పగలౌబో లోలోనె ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం