సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ముగురువేలుపులకు
టైటిల్: ముగురువేలుపులకు
పల్లవి:
ప|| ముగురువేలుపులకు మూల మీతడు | జగిమీరి నెదుటను సేవించరే ||
చరణం:చ|| అంచల బన్నీటిబిందె లందుకొని యిందరును | నించి మజ్జనము దేవునికి జేయగా |
వంచి సముద్రముమీద వానలు గురిసినట్టు | పొంచి యన్నిటాను ఉప్పొంగుచున్నాడు ||
చ|| పచ్చకప్పురము మేన బలుమారు మెత్తగాను | తచ్చి పున్నమచంద్రుడే తానై వున్నాడు |
అచ్చపుదట్టుపుణుగు ఆమీద బుయ్యగాను | నిచ్చ గల్పకతరువునీడయై వున్నాడు ||
చ|| అలమేలుమంగతోడ నన్నిసొమ్ములు నించగా | పలుపంచవన్నెలసంపద యైనాడు |
యెలమి శ్రీవేంకటేశు డిన్నిటా బ్రతాపించి | కులికి పుణ్యాలకెల్లా గురియైనాడు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం