సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: ముంచినవేడుకతోడ
టైటిల్: ముంచినవేడుకతోడ
పల్లవి:
ప|| ముంచినవేడుకతోడ మొక్కుటగాక | కంచములోపలికూడు కాలదన్నేటికి ||
చరణం:చ|| వేదార్థములు నీవేవిహరించినసుద్దులే | కాదని అవునని కొన్నివాదములేల |
యేది నీవు సేసినాను యిన్నియును నియ్యకోలే | సోదించనేటికి యందు సొట్టు లెంచనేటికి ||
చ|| కర్మము లిన్నియును నీకైంకర్యసాధనాలే | అర్మిలి దారతమ్యము లడుగనేల |
నిర్మితము నీదింతే నెరసు లెంచగనేల | ధర్మమందు నింక గజదంతపరీక్షేటికి ||
చ|| భక్తియింతా నొక ఘంటాపథము నీశావలే | యుక్తి బాత్రపాత్రములు యూహించనేల |
ముక్తికి శ్రీవేంకటేశ మూలము నీపాదములు | సక్తులము నమ్ముటగాక చలపదమేటికి ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం