సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: మూడేమాటలు మూడుమూండ్లు
టైటిల్: మూడేమాటలు మూడుమూండ్లు
పల్లవి:
ప|| మూడేమాటలు మూడుమూండ్లు తొమ్మిది | వేడుకొని చదవరో వేదాంత రహస్యము ||
చరణం:చ|| జీవస్వరూపము చింతించి యంతటాను | దేవుని వైభవము తెలిసి |
భావించి ప్రకృతి సంపదయిది యెరుగుడే | వేవేలు విధముల వేదాంత రహస్యము ||
చ|| తనలోని విజ్ఞానము తప్పకుండా దలబోసి | పనితోడ నందువల్ల భక్తినిలిపి |
మనికిగా వైరాగ్యము మరవకుండుతే | వినవలసిన యట్టి వేదాంత రహస్యము ||
చ|| వేడుకతో నాచార్య విశ్వాసము గలిగి | జాడల శరణాగతి సాధనముతో |
కూడి శ్రీవేంకటేశుగొలిచి దాసుడౌటే | వీడని బ్రహ్మానంద వేదాంత రహస్యము ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం