సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: మూసిన ముత్యాల
పల్లవి:

మూసిన ముత్యాన కేలే మొరగులు
ఆశల చిత్తాన కేలే అలవోకలు ||

చరణం:

కందులేని మోమున కేలే కస్తూరి
చిందు నీకొప్పున కేలే చేమంతులు
మందయానమున కేలే మట్టెల మోత
గంధమేలే పై కమ్మని నీమేనికి ||

చరణం:

భారపు గుబ్బల కేలే పయ్యద నీ
బీరపు జూపుల కేలే పెడమోము
జీరల భుజాల కేలే చెమటలు నీ
గోరంట గోళ్ళ కేలే కొనవాండ్లు ||

చరణం:

ముద్దుల మాటల కేలే ముదములు నీ
యద్దపు జెక్కుల కేలే అరవిరి
వొద్దిక కూటమి కేలే వూర్పులు నీకు
నద్దమేలే తిరువేంకటాద్రీశు గూడి ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం