సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నామోము చూచిచూచి
పల్లవి:

నామోము చూచిచూచి నడుమ నేలకొంకేవు
ఆముకొని మెచ్చగానే నడ్డమాడేనా ||

చరణం:

బత్తిగలవాడవు పడతి పాటివింటివి
చిత్తము రంజించి నీకు చెవిబట్టెనా
యిత్తల మే చెమరించె నెంతగరగెనో మతి
పొత్తుల వాకుచ్చి యాకె బొగడగరాదా ||

చరణం:

సరినిడుకొంటివి చదివించితి వాపెను
తిరమైన యాయర్ధము తెలిసితివా
నిరతి బులకలెల్లా నిండెను సంతోసమెంతో
అరుదైన వుడుగరట్టె ఇయ్యరాదా ||

చరణం:

శ్రీ వేంకటేశుడవు చెలియాట చూచితివి
భావించి నీకు గన్నుల పండుగాయనా
యీవల నన్నేలితివి ఇదెంత జాణతనమో?
సేవసేసే మిద్దరము సేసచల్ల రాదా ? ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం