సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నానాదిక్కుల
టైటిల్: నానాదిక్కుల
పల్లవి:
ప|| నానాదిక్కుల నరులెల్లా | వానలలోననె వత్తురు గదలి ||
చరణం:చ|| సతులు సుతులు బరుసరులు బాంధవులు | హితులు గొలువగా నిందరును |
శతసహస్రయోజనవాసులు సు- | వ్రతములతోడనె వత్తురు గదలి ||
చ|| ముడుపులు జాళెలు మొగి దలమూటలు | కడలేనిధనము గాంతలును |
కడుమంచిమణులు కరులు దురగములు | వడిగొని చెలగుచు వత్తురు గదలి ||
చ|| మగుటవర్ధనులు మండలేశ్వరులు | జగదేకపతులు జతురులును |
తగువేంకటపతి దరుశింపగ బహు- | వగలసంపదల వత్తురు గదలి ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం