సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నాపాలిఘన దైవమవు
టైటిల్: నాపాలిఘన దైవమవు
పల్లవి:
ప|| నాపాలిఘన దైవమవు నీవే నన్ను | నీపాల నిడుకొంటి నీవే నీవే ||
చరణం:చ|| ఒలిసి నన్నేలే దేవుడవు, యెందు | దొలగని నిజబంధుడవు నీవే |
పలు సుఖమిచ్చే సంపదవు నీవే, యిట్టే | వెలయ నిన్నియు నీవే నీవే ||
చ|| పొదిగి పాయని యాప్తుడవు నీవే, నాకు | నదన దోడగు దేహమవు నీవే |
మదమువాపెడి నామతియు నీవే, నాకు | వెదక నన్నియును నీవే నీవే ||
చ|| ఇంకా లోకములకు నెప్పుడు నీవే, యీ- | పంకజభవాది దేవపతివి నీవే |
అంకిలి వాపగ నంతకు నీవే, తిరు- | వేంకటేశ్వరుడవు నీవే నీవే ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం