సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నారాయణ నీనామమెగతి
పల్లవి:

నారాయణ నీనామమెగతి యిక
కోర్కెలు నాకు కొనసాగుటకు ||

చరణం:

పైపై ముందట భవజలధి
దాపు వెనక చింతాజలధి
చాపలము నడుమ సంసారజలధి
తేపయేది యిది తెగనీదుటకు ||

చరణం:

పండె నెడమ పాపపు రాశి
అండ గుడిని పుణ్యపు రాశి
కొండను నడుమ త్రిగుణ రాశి ఇవి
నిండ కుడుచుటకు నిలుకడ యేది ||

చరణం:

కింది లోకములు కీడు నరకములు
అందెటి స్వర్గాలవె మీద
చెంది యంతరాత్మ శ్రీ వేంకటేశ నీ-
యందె పరమపద మవల మరేది ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం