సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నారాయణ నీనామము
టైటిల్: నారాయణ నీనామము
పల్లవి:
ప|| నారాయణ నీనామము బుద్ధి- | జేరినా జాలు సిరు లేమిబాతి ||
చరణం:చ|| ననుపైనశ్రీవిష్ణునామము పేరు- | కొనగానే తేకువమీరగా |
ఘనమైనపుణ్యాలు గలుగగా తమ- | కనయము బర మది యేమిబాతి ||
చ|| నలువైన శ్రీహరినామము మతి- | దలచిన నాబంధము లూడగా |
యెలమి దీని బఠియించినా యీ- | కలుషములేల కలుగు నెవ్వరికి ||
చ|| వేంకటపతినామవిభవము కర్మ- | పంకములెల్ల బరిమార్పగా |
బింకమై తలపెడి ప్రియులకు యెందు- | నింక నీసుఖ మిది యేమిబాతి ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం