సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నాటికి నాడే
టైటిల్: నాటికి నాడే
పల్లవి:
ప|| నాటికి నాడే నాచదువు | మాటలాడుచును మరచేటిచదువు ||
చరణం:చ|| ఎనయ నీతని నెరుగుటకే పో | వెనకవారు చదివినచదువు |
మనసున నీతిని మరచుటకే పో | పనివడి యిప్పటి ప్రౌఢలచదువు ||
చ|| తెలిసి యితనినే తెలియుటకే పో | తొలుత గృతయుగాదుల చదువు |
కలిగియీతని గాదననే పో | కలియుగంబులో గలిగిన చదువు ||
చ|| పరమై వేంకటపతి గనుటకే పో | దొరలగు బ్రహ్మాదుల చదువు |
సిరుల నితని మరచెడికొరకే పో | విరసపుజీవుల విద్యలచదువు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం