సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నాటికి నాడు
టైటిల్: నాటికి నాడు
పల్లవి:
ప|| నాటికి నాడు గొత్త నేటికి నేడు గొత్త | నాటకపుదై వమవు నమో నమో ||
చరణం:చ|| సిరుల రుక్మాంగదుచేతికత్తిధార దొల్లి | వరుస ధర్మాంగదుపై వనమాలాయ |
హరి నీకృపకలిమి నట్లనే అరులచే | కరిఖద్గధార నాకు గలువదండాయ ||
చ|| మునుప హరిశ్చంద్రమొనకత్తిధార దొల్లి | పొనిగి చంద్రమతికి బూవుదండాయ |
వనజాక్ష నీకృపను వరశత్రులెత్తినట్టి- | ఘనఖడ్గధార నాకు గస్తూరివాటాయ ||
చ|| చలపట్టి కరిరాజు కరణంటే విచ్చేసి | కలుషము బెడబాసి కాచినట్టు |
అలర శ్రీవేంకటేశ ఆపద లిన్నియు బాసి | యిలనన్ను గాచినది యెన్న గతలాయ ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం