సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నాటకమింతా
టైటిల్: నాటకమింతా
పల్లవి:
ప|| నాటకమింతా నవ్వులకే | పూటకు బూటకు బొల్లైపోవు ||
చరణం:చ|| కోటి విద్యలును గూటి కొరకే పో | చాటున మెలగేటి శరీరికి |
తేటల నాకలి దీరిన పిమ్మట | పాటుకు బాటే బయలై పోవు ||
చ|| మెరసేటి దెల్లా మెలుతల కొరకే | చెరల దేహముల జీవునికి |
అర మరవుల సుఖమందిన పిమ్మట | మెరుగుకు మెరుగే మొయిలై పోవు |
చ|| అన్ని చదువులును నాతని కొరకే | సన్నెరిగిన సుజ్ఞానికిని |
యిన్నిట శ్రీ వేంకటేశు దాసునికి | వెన్నెల మాయలు విడివిడి పోవు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం