సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నడువరో జడియక
టైటిల్: నడువరో జడియక
పల్లవి:
ప|| నడువరో జడియక సవ్యమార్గమిది | మడుగరి వైష్ణవ మార్గమిది ||
చరణం:చ|| ఘన శుకముఖ్యులు గన్న మార్గమిది | జనకాదుల నిశ్చల మార్గమిది |
సనత్కుమారుడు జరపు మార్గమిది | మనువుల వైష్ణవ మార్గమిది ||
చ|| నలుగడ వసిష్ఠు నడుచు మార్గమిది | యిల వేదవ్యాసుల మార్గంబిది |
బలిమిగలుగు ధృవపట్టపు మార్గమిది | మలసినవైష్ణవ మార్గమిది ||
చ|| పరమ మార్గంబిదె ప్రపంచ మార్గమిది | గురు మార్గంబిదె గోప్యమిదే |
గరిమెల శ్రీ వేంకటపతి మాకును | మరిపెను వైష్ణవ మార్గమిదే ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం