సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నే నేమిసేయుదును
టైటిల్: నే నేమిసేయుదును
పల్లవి:
ప|| నే నేమిసేయుదును నీవు నాలోపలనుండి | శ్రీనాథుడవు నీచేత ఇంతేకాక ||
చరణం:చ|| తనువేమిసేయును తనువులోపలయున్న- | చెనటియింద్రియములచేతలుగాక |
మనసేమిసేయును మనసులోపలనున్న- | నినుపుగోర్కులు చేసేనేరములుగాక ||
చ|| జీవుడేమిసేయును జీవునిబొదుగుకున్న- | భావపుప్రకృతి చేసేపాపముగాక |
చేవదేర బుట్టు వేమిసేయు ముంచుకొన్నట్టి- | దైవపుమాయలోనిధర్మ మింతేకాక ||
చ| కాలమేమిసేయును గక్కన శ్రీవేంకటేశు- | డేలి మన్నించేమన్నన యిదియేకాక |
యేల యేల దూర నింక నెవ్వరు నేమిసేతురు | మేలిమి నిను దలచి మెచ్చుటేకాక ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం