సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నేల మిన్ను
పల్లవి:

నేల మిన్ను నొక్కటైననీబంటు వొక్క- |
వేలనే యక్షుని దెగవేసెగా నీబంటు ||

చరణం:

ఉంగర మెగరవేసి యుదధిలో బడకుండ
నింగికి జెయిజాచి నీబంటు
చంగున జలధిదాటి జంబుమాలి నిలమీద
కుంగదొక్కి పదముల గుమ్మెగా నీబంటు ||

చరణం:

వెట్టగా రావణు రొమ్మువిరుగ జేతనే గుద్దె
నిట్టతాడువంటివాడు నీబంటు
దిట్టయై మందులకొండ తేజమున నడురేయి
పట్టపగలు దెచ్చె బాపురే నీబంటు ||

చరణం:

అలరనన్నియు జేసి అజునిపట్టానకు
నిలుచున్నాడదివో నీబంటు
బలువేంకటేశ ఈ పవననందనుడు
కలిగి లోకములెల్ల గాచెగా నీబంటు ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం