సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నేనెంతవాడను
టైటిల్: నేనెంతవాడను
పల్లవి:
ప|| నేనెంతవాడను నిన్నడిగి నంటే | వీనుల నీకథలెల్లా వినుటేగా ||
చరణం:చ|| అలిగిన అలుగక అన్యులు మరిదూరి | పలికినను మారు పలుకక వాదు |
తలచిన కలుగకసరి కొట్టినను గాని | మూలుగనివాడే గదా ముక్తికి నర్హుడు ||
చ|| నగినను తానగక నాతులెవ్వరైన | తగిలి పెసగిన తగులక |
వగచినా వగవక వ్రతము చేరిచె మంటే | మొగమోడకున్నవాడే ముక్తికి నర్హుడు ||
చ|| విరిచినా విరువక విష్ణుభక్తియె దాటున | వెరపించిన మరి వెడవక |
నెరవై శ్రీ వేంకటేశ నీ పాదములె నమ్మి | మెరుగు లేనివాడె ముక్తికి నర్హుడు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం