సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నేర్పుకంటె బెన్నిధి
టైటిల్: నేర్పుకంటె బెన్నిధి
పల్లవి:
ప|| నేర్పుకంటె బెన్నిధి గద్దా | ఓర్పుకంటె సుఖమొకటి గద్దా ||
చరణం:చ|| కరుణకు నెక్కుడు గతి యిక గద్దా | సరసత కెక్కుడు సరిగద్దా |
గురుమతి జిత్తము కూరిమి నిలిపిన | నెరవుకంటె విధమిక గద్దా ||
చ|| కలిమికంటె జీకటి మరి కద్దా | బలిమి కంటె నాపద గద్దా |
గెలుపు(గ) దెలెసి లంకించిన మతితో | జెలగుకంటె నిజనీతి యిక గద్దా ||
చ|| పాయము కంటె నపాయము గద్దా | కాయపు రోతకు గడ గద్దా |
పాయక వేంకట పతికృప గోరిన | యీ యభిమతమున కెదురిక గద్దా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం