సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నేరుపరి ననుకోను
టైటిల్: నేరుపరి ననుకోను
పల్లవి:
ప|| నేరుపరి ననుకోను నెరజాణ ననుకోను | యీరీతి నాహావ భావాలింతెఱగడా ||
చరణం:చ|| మలసి తనతో నేను మాటలాడనని దూరి | నెలవుల నవ్వితేనే సేన మాటలే |
పిలిపించనని తాను బిగువులు నెరపీని | తలుపు దెరచితేనే తగుసన్న గాదా ||
చ|| దగ్గర గూచుండనంటా తమకించి నంతలోనె | సిగ్గువడి వుండితేనే చేరి వుండుటే |
వొగ్గి తన్ను జూడనంటా వొరట్లు వట్టీని | అగ్గమై యెదుట నుంటే అన్నియును గాదా ||
చ|| ముందు కౌగిలించనంటూ మొనలెల్ల జూపీని | ఇందమని విడేమిచ్చుటదియే అది |
అందపు శ్రీ వేంకటేశుడలమేలుమంగ నేను | పొందితిమిద్దరమివి పోదులెల్లా గావా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం