సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నెలమూడు శోభనాలు
టైటిల్: నెలమూడు శోభనాలు
పల్లవి:
ప|| నెలమూడు శోభనాలు నీకు నతనికిదగు | కలకాలమును నిచ్చకల్యాణమమ్మా ||
చరణం:చ|| రామనామమతనిది రామవు నీవైతేను | చామన వర్ణమతడు చామవు నీవు |
వామనుడందురతని వామనయనవు నీవు | ప్రేమపుమీ యిద్దరికి పేరుబలమొకటే ||
చ|| హరి పేరాతనికి హరిణేక్షణవు నీవు | కరిగాచెదాను నీవు కరియానవు |
సరి జలధిశాయి జలధికన్యవు నీవు | బెరసి మీయిద్దరికి బేరుబలమొకటే ||
చ|| జలజ నాభుడతడు జలజముఖివి నీవు | అలమేలుమంగవు నిన్నెలమెదాను |
ఇలలో శ్రీవేంకటేశుడిటు నిన్నురానమోచె | పిలిచి పేరుచెప్పెబేరుబలమొకటే ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం