సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నెయ్యములలో నేరెళ్ళో
టైటిల్: నెయ్యములలో నేరెళ్ళో
పల్లవి:
ప|| నెయ్యములలో నేరెళ్ళో | వొయ్యన వూరెడి వువ్విళ్ళో ||
చరణం:చ|| పలచని చెమటల బాహుమూలముల | చెలములలోనా జెలువములే |
ధళధళమను ముత్యపు జెరగు సురటి | దులిపేటి నీళ్ళ తుంపిళ్ళో ||
చ|| తొటతొత గన్నుల దొరిగేటినీళ్ళ | చిటిపొటి యలుకలు చిరునగవే |
వట ఫలంబు నీ వన్నెల మోవికి | గుటుకల లోనా గుక్కిళ్ళో ||
చ|| గరిగరికల వేంకటపతి కౌగిట | పరిమళములలో బచ్చనలు |
మరునివింటి కమ్మనియంప విరుల | గురితాకులినుప గుగ్గిళ్ళో ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం