సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నెయ్యని పోసుకోరాదు
టైటిల్: నెయ్యని పోసుకోరాదు
పల్లవి:
ప|| నెయ్యని పోసుకోరాదు నీళ్ళని చల్లగరాదు | చెయ్యార గంటిమి నేడు చేరి నీతో పొందుట |
చరణం:చ|| ప్రేమము చాలాజేసి పెక్కు సతులతోను | మోము చూడ సిగ్గుపడి ముసుగుతో నున్నదాన |
జామువోయి వచ్చినీవు సరసములాడేవు | యేమని నేనియ్యకుందు నేటిజన్మమయ్య ||
చ|| పలుమారు నీతోనవ్వి పరాకై వుండిన నీతో | పలుకగ సిగ్గుపడి భావింపుచు నున్నదాన |
కలగన్నట్లా వచ్చి కందువలంటేవు నన్ను | బలిమి యేమున్నది నాబదుకు నీ చేతిది ||
చ|| మచ్చికతో నిన్నుగూడి మన్నించిన నీతోను | పచ్చిసేయ సిగ్గుపడి వదరక వున్నదాన
యెచ్చుగా శ్రీ వేంకటేశ యిట్టెనన్ను నేలితివి | విచ్చన విడాయ నా విభవము లెల్లను ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం