సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నగధర నందగోప
టైటిల్: నగధర నందగోప
పల్లవి:
ప|| నగధర నందగోప నరసింహ వో- | నగజవరద శ్రీ నారసింహ ||
చరణం:చ|| నరసింహ పరంజ్యోతి నరసింహా వీర- | నరసింహ లక్ష్మీనారసింహా |
నరసుఖ బహుముఖ నారసింహా వో- | నరకాంతక జేజే నారసింహా ||
చ|| నమో నమో పుణ్డరీక నారసింహ వో- | నమిత సురాసుర నారసింహా |
నమకచమకహిత నారసింహా వో- | నముచిసూదన వంద్య నారసింహా ||
చ|| నవరసాలంకార నారసింహా వో- | నవనీతచోర శ్రీ నారసింహా |
నవగుణ వేంకట నారసింహా వో- | నవమూర్తి మండెము నారసింహా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం