సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నగుబాట్లబడేనాజిహ్వా
టైటిల్: నగుబాట్లబడేనాజిహ్వా
పల్లవి:
ప|| నగుబాట్లబడేనాజిహ్వా | పగటున నిదివో పావనమాయ ||
చరణం:చ|| ఇల నిందరి నుతియించి పెంచువలె | నలినలియైనది నాజిహ్వా |
నలినోదరుశ్రీనామము దలచిన- | ఫలమున కిదివో పావనమాయ ||
చ|| భ్రమపడి మాయపుపడతులతమ్మలు | నమలి చవులుగొనె నాజిహ్వా |
అమరవంద్యుడగుహరి నుతియించగ | ప్రమదము చవిగొని పావనమాయ ||
చ|| నెలతలయోనిద్రవనదులను | నలుగడ నీదెను నాజిహ్వా |
అలసి వేంకటనగాధిపయనుచును | పలికినయంతనె పావనమాయ ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం