సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నిగమనిగమాంతవర్ణిత
టైటిల్: నిగమనిగమాంతవర్ణిత
పల్లవి:
ప|| నిగమనిగమాంతవర్ణిత మనోహర రూప- | నగరాజధరుడ శ్రీనారయణా ||
చరణం:చ|| దీపించు వైరాగ్యదివ్య సౌఖ్యం బియ్య- | నోపకరా నన్ను నొడబరపుచు |
పైపైనె సంసారబంధముల గట్టేవు | నాపలుకు చెల్లునా నారాయణా ||
చ|| చికాకుపడిన నా చిత్తశాంతము సేయ- | లేకకా నీవు బహులీల నన్ను |
కాకుసేసెదవు బహుకర్మల బడువారు | నాకొలదివారలా నారాయణా ||
చ|| వివివిధ నిర్బంధముల వెడలద్రోయక నన్ను | భవసాగరముల నడబడ జేతురా |
దివిజేంద్రవంద్య శ్రీ తిరువేంకటాద్రీశ | నవనీత చోర శ్రీనారాయణా ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం