సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నీదాసుల భంగములు
టైటిల్: నీదాసుల భంగములు
పల్లవి:
ప|| నీదాసుల భంగములు నీవుజూతురా | ఏదని జూచేవు నీకు నెచ్చరించవలెనా ||
చరణం:చ|| పాల సముద్రము మీద పవ్వళించ్చినట్టి నీకు | బేలలై సురలు మొరవెట్టిన యట్టు |
వేళతో మామనువులు విన్నవించితిమి నీకు | ఏల నిద్దిరించేవు మమ్మిట్టే రక్షించరాద ||
చ|| ద్వారకా నగరములో తగ నెత్తమాడే నీకు | బిరాన ద్రౌపది మొరవెట్టిన యట్టు |
ఘోరపు రాజసభల కుంది విన్నవించితిమి | ఏరీతి పరాకు నీకు నింక రక్షించరాద ||
చ|| ఎనసి వైకుంఠములో నిందిర గూడున్న నీకు | పెనగి గజము మొరవెట్టిన యట్టు |
చనువుతో మాకోరికె సారె విన్నవించితిమి | విని శ్రీవేంకటేశుండ వేగ రక్షించరాద ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం