సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నీకథామృతము
టైటిల్: నీకథామృతము
పల్లవి:
ప|| నీకథామృతము నిరతసేవన నాకు | చేకొనుట సకల సంసేవనంబటుగాన |
చరణం:చ|| ఇదియే మంత్రరాజము నాకు నే ప్రొద్దు | ఇదియే వేద సంహిత పాఠము |
ఇదియె బహుశాస్త్ర మెల్ల చదువుటనాకు | ఇదియె సంధ్య నాకిదియె జపమటుగాన ||
చ|| ఇదియె బ్రహ్మవిద్యోపదేశము నాకు | ఇదియె దుఃఖవిరహిత మార్గము |
ఇదియె భవ రోగరహిత భేషజమునాకు | ఇదియె ఉపనిషద్వ్యాక్య పద్ధతి ||
చ|| ఇదియె దాన ఫలమీ జాలినది నాకు | ఇదియె తలప పరహిత మార్గము |
ఇదియె తిరువేంకటేశ నీసంస్మరణ- | మిదియె ఇదియె యిన్నియును నటుగాన ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం