సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నీమహత్త్వంబు లోనికి
టైటిల్: నీమహత్త్వంబు లోనికి
పల్లవి:
ప|| నీమహత్త్వంబు లోనికి వెలుపలికి గప్పి | కామింప నిట్టిదని కానారా దటుగాన ||
చరణం:చ|| నిండి యిన్నిటిలోన నీవు గలవని భ్రాంతి- | నుండుదువుగాని నీ వొకటియును గావు |
దండిగలగిరి ప్రతిధ్వని దోచుగాని యది | కొండలోపల లేదు కొండయును గాదు ||
చ|| బలసి యిన్నిటిలోపలను జైతన్యమై | మెలగుదువుగాని యేమిట నీవు లేవు |
పలుదెరగులైన దర్పణమునం దొకనీడ | వొలయుగాకందు దలపోయ నదిలేదు ||
చ|| వుడుగకన్నిటిలోన నుండుటయు లేదు నీ- | వుడివోయి యందుండకుండుటయు లేదు |
చెడనితేజముగాన శ్రీవేంకటేశ నీ- | పొడవు పరిపూర్ణమై పొలుపొందు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం