సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నీపాపమే కాదు
టైటిల్: నీపాపమే కాదు
పల్లవి:
ప|| నీపాపమే కాదు, ఇది నిండిన లోకము జాడ | పైపై వచ్చిన వలపు పాటించరెవ్వరును ||
చరణం:చ|| అట్టే మంచిమాటలాడే అతివ బాతి పడగ | చిట్టకములాడే యింతిజెనకేవు |
అట్టే కాదా పంచదార అండనెంత వుండినాను | పట్టి పెనగేటి నిమ్మపంటికి నోరూరును ||
చ|| చేతులెత్తి మొక్కేటి చెలి గాచుకుండగాను | ఆతలిమోమైన వారి కాసపడేవు |
జాతితో బాలపండ్లు సంగడినే వుండగాను | ఘాత బెరిగే బూరుగు గాయలు చూపట్టును ||
చ|| నెట్టన బెండ్లాడిన నేనే నీ కుండగాను | ఱట్టు గొల్లెతలచే నాఱడి బొందితి |
ఇట్టేనిన్ను గూడితిని యిందాకా శ్రీ వేంకటేశ | వొట్టితే పాలును జల్లా నొక్కరీతి నుండును ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం