సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నీవే కావింక
టైటిల్: నీవే కావింక
పల్లవి:
ప|| నీవే కావింక నేనన్య మెరగ యే- | త్రోవ చూపి నాకు దోడయ్యెదవయ్య ||
చరణం:చ|| అపరాధశత కోట్లయినవి వొక్క- | నెపమున నను గవనేరవా |
అపరిమితదురితా లైనవి యే- | ఉపమచేత నన్ను నుద్ధరించెదవయ్య ||
చ|| అతిశయముగ గర్మినైతిని నీ- | మతము నాకొకయింత మరపవా |
ఇతరకర్మారంభహితుడను | గతి మోక్షమెటువలె గల్పించెదవయ్య ||
చ|| తిరువేంకటాచలాధీశ్వరా నీ- | శరణాగతుల బ్రోవజాలవా |
పరమదయానందపరుడవు యే- | వెరవున భవములు వెడలద్రోచెదవయ్య ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం