సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నీవే మూలమువో
టైటిల్: నీవే మూలమువో
పల్లవి:
ప|| నీవే మూలమువో నేరిచినపెద్దలకు | దేవుడు నీయందులోనే తిరమాయ నిదివో ||
చరణం:చ|| బాపురే వో దేహమా బాపురే వో నీవు | వోపి నే బెట్టినకొద్ది నుందువుగా |
రూపు నీవు గలిగితే రుచులెల్ల గానగద్దు | చాపలాన ధర్మములు సాధింపగలదు ||
చ|| మెచ్చితి నోమనసా మెచ్చితివో నీవూ నా- | యిచ్చకొలది నెందైనా నేగుదువుగా |
అచ్చపునీకతమున నవుగాము లెంచగవద్దు | పచ్చిగా యేమూర్తినైనా భావించగలదు ||
చ|| మేలు మేలు నాలికె మేలు మేలు నీవు | వోలి యేమాటకునైనా నొనరుదుగా |
చాలి నీవు మెలగంగ చదువు చదువగద్దు | పోలించి శ్రీవేంకటేశు బొగడగగలదు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం