సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నీవేకా చెప్పజూప
టైటిల్: నీవేకా చెప్పజూప
పల్లవి:
ప|| నీవేకా చెప్పజూప నీవె నీవెకా | శ్రీవిభుప్రతినిధివి సేనమొదలారి ||
చరణం:చ|| నీవేకా కట్టెదుర నిలుచుండి హరివద్ద | దేవతల గనిపించే దేవుడవు |
యేవంక విచ్చేసినాను యిందిరాపతికి నిజ- | సేవకుడవు నీవెకా సేనమొదలారి ||
చ|| పసిడిబద్దలవారు పదిగోట్లు గొలువ | దెసల బంపులువంపే ధీరుడవు |
వసముగా ముజ్జగాలవారి నిందరిని నీ- | సిసువులగా నేలిన సేనమొదలారి ||
చ|| దొరలైన యసురుల తుత్తుమురుసేసి జగ- | మిరువుగా నేలితివేకరాజ్యమై |
పరగుసూత్రవతీపతివై వేంకటవిభు- | సిరులపెన్నిధి నీవే సేసిమొదలారి ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం