సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నీవేకాని యింక
టైటిల్: నీవేకాని యింక
పల్లవి:
ప|| నీవేకాని యింక నేనన్య మెరుగనే | త్రోవజూసి నాకు తోడయ్యెద వయ్య ||
చరణం:చ|| అపరాధ శత కోట్లయిన నీ వొక్క | నెపమున ననుగావ నేరవా |
అపరిమిత దురితా లైనవి యే- | వుపుమ చేత నన్ను ఉద్ధరించెద వయ్య ||
చ|| అతిశయముగ కర్మి నైతిని నీ- | మతము నాకొక యింత మఱపవా |
ఇతర కర్మారంభ హితుడనే నాకింక | గతి మోక్ష మెటువలె కల్పించెద వయ్య ||
చ|| తిరు వేంకటాచలాధీశ్వర నీదు | శరణాగతులను బ్రోవగరాదా |
పరమ దయానంద పరుడవు నీవు యే- | వెరవున భవములు వెడల ద్రోచెద వయ్య ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం