సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నీవేల సిగ్గుపడేవు
టైటిల్: నీవేల సిగ్గుపడేవు
పల్లవి:
ప|| నీవేల సిగ్గుపడేవు నెట్టన దలవంచుక | భావించి నిన్ను బైకొని మెచ్చీని ||
చరణం:చ|| వాడలు దిరిగి నీవు వచ్చిన రాకచూచి | వేడుకలు వెదచల్లీ వెలది |
జాడలతో నీ మోము చంద్రకళలు చూచి | వీడెపు నోటనే వేమారు బొగడీని ||
చ|| విదుటు దమకమున వుండే నీవునికి చూచి | కదిసి నవ్వులు నవ్వీ గలికి |
పొదిగిన నీశిరసు పువ్వులదండలు చూచి | యెదుట నిలుచుండి చేయెత్తి మొక్కీని ||
చ|| గక్కున వస్తా వచ్చి కౌగిట గూడగా చూచి | చెక్కులు నొక్కి నిన్ను దెలియ |
నిక్కి శ్రీ వేంకటేశుడ నీ మన్ననలెల్లా జూచి | పక్కన నీమీదటి పదాలు వాడీని ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం