సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నీవేమి సేతువయ్య
టైటిల్: నీవేమి సేతువయ్య
పల్లవి:
ప|| నీవేమి సేతువయ్య నీవు దయానిధి వందువు | భావించలేనివారి పాపమింతే కాని ||
చరణం:చ|| పరమపద మొసగి పాపమడచేనని | చరమశ్లోకమునందు చాటితివి తొలుతనె |
నిరతిని భూమిలోన నీవల్ల దప్పులేదు | పరగ నమ్మనివారి పాపమింతే కాని ||
చ|| నీపాదములకు నాకు నెయ్యమైన లంకెని | యేపున ద్వయార్థమున నియ్యకొంటివి తొలుత |
దాపుగా నీవల్ల నింక దప్పులేదు యెంచిచూచి | పైపై నమ్మినవారి పాపమింతే కాని ||
చ|| బంతి బురాణములను భక్తసులభుడ నని | అంతరాత్మ నీమాట ఆడితివి తొలుతనే |
ఇంతట శ్రీవేంకటేశ యేమిసేతువయ్య నీవు | పంతాన నమ్మినవారి పాపమింతే కాని ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం