సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నీవెరగనిది లేదు
టైటిల్: నీవెరగనిది లేదు
పల్లవి:
ప|| నీవెరగనిది లేదు నీయాజ్ఞ మోచితి నింతే | నీవాడ నింతే హరి నేనన జోటేది ||
చరణం:చ|| కన్నుల కెందైన జూపుకలది స్వభావము | యెన్నగ నాయందు బాపమెంచజోటేది |
విన్ననై చెవులకింపు వినుట స్వభావము | పన్నిన కర్మాలు నన్ను బైకొన జోటేది ||
చ|| నాలికకు జవియైతే నమలుటే సహజము | నాలి అభోజ్యపునింద నాకు బనేమి |
మూల వాసనగొనేది ముక్కుకు సహజము | జోలిబంధములు నన్ను జుట్టగజోటేది ||
చ|| కాయము కాయముపొంత గరగుటే ఆగుణము | సేయనిచేతలు నాపై జెప్ప జోటేది |
యీయెడ శ్రీవేంకటేశ యిన్నిటిలో నన్ను బెట్టి | పాయక నాలో నుందువు పట్టగ జోటేది ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం