సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నీవనగ నొకచోట
టైటిల్: నీవనగ నొకచోట
పల్లవి:
ప|| నీవనగ నొకచోట నిలిచివుండుటలేదు | నీవనుచు గనుగొన్ననిజమెల్ల నీవే ||
చరణం:చ|| తనయాత్మవలెనె భూతములయాతుమలెల్ల- | ననయంబు గనుగొన్నయతడే నీవు |
తనుగన్నతల్లిగా తగనితరకాంతలను | అనఘుడై మదిజూచునతడే నీవు ||
చ|| సతతసత్య వ్రతాచార సంపన్నుడై | అతిశయంబుగ మెలగునతడే నీవు |
ధృతిదూలి ద్రవ్యంబు తృణముగా భావించు- | హతకాముకుడైన యతడే నీవు ||
చ|| మోదమున సుకదుఃఖములు నొక్కరీతిగా | నాదరింపుచున్నయతడే నీవు |
వేదోక్తమతియైన వేంకటాచలనాథ | ఆదియును నంత్యంబు నంతయును నీవే ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం