సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నిజమో కల్లో
టైటిల్: నిజమో కల్లో
పల్లవి:
ప|| నిజమో కల్లో నిముషములోననె | భజించువారల భాగ్యము కొలది ||
చరణం:చ|| వొకడు కనుదెరచి వున్నది జగమను | వొకడు కన్నుమూసొగి లేదనుచు |
సకలము నిట్లనె సర్వేశ్వరుడును | వెకలి నరులు భావించినకొలది ||
చ|| కడుపు నిండొకడు లోకము దనిసె ననును | కడుపు వెలితైన గడమను నొక్కడు |
తడవిన నిట్లనే దైవమిందరికి | వెడగు నరులు భావించినకొలది ||
చ|| ముదిసి యొకడనును మోక్షము చేర్వని | తుద బుట్టొకడది దూరమనును |
యెదుటనే శ్రీవేంకటేశ్వరు డిట్లనే | వెదకి నరులు భావించినకొలది ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం