సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నిక్కించీ గర్ణములు
టైటిల్: నిక్కించీ గర్ణములు
పల్లవి:
ప|| నిక్కించీ గర్ణములు మానిసిమెకము | నిక్కపుగరుణతో మానిసిమెకము ||
చరణం:చ|| కొండ తనకు గద్దెగా గోరి కూచుండిన దదే | నిండురాజసమున మానిసిమెకము |
గండుమీరి దానవునికండలు చెక్కుచు నూర్పు | నిండించీ నాకసము మానిసిమెకము ||
చ|| కరములువేయింటా గైకొని యాయుధములు | నిరతి జళిపించీ మానిసిమెకము |
సురలను నసురల జూచిచూచి మెచ్చిమెచ్చి | నెరపీని నవ్వులు మానిసిమెకము ||
చ|| యెక్కించి తొడమీద నిందిరతో మేలమాడీ | నిక్కపుగాగిటను మానిసిమెకము |
అక్కడ శ్రీవేంకటాద్రి నహోబలమునందు | నెక్కొని మమ్మేలెను మానిసిమెకము ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం