సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నిందలేని పతివిదె
టైటిల్: నిందలేని పతివిదె
పల్లవి:
ప|| నిందలేని పతివిదె నీవు నాసొమ్ము | కందువ సొమ్ముల మీద గలిగెను సొమ్ము ||
చరణం:చ|| సూటిగా నీవు చూచేటి చూపు నాసొమ్ము | పాటించి నీవు పలికే పలుకు నాసొమ్ము |
కూటమి రతుల కొనగోరు నాసొమ్మును | యీటున నీమేని సొమ్ము లిఛ్ఛెవు నాకు ||
చ|| చవిగా నాడే నీ సరసము నాసొమ్ము | జవకట్టక యిచ్చే నీచనువు నాసొమ్ము |
నవకమైన నీ నవ్వు నాసొమ్ము | యివల నింకా సొమ్ములిచ్చేవు నాకు ||
చ|| కింకలేని దిది నీకౌగిలి నాసొమ్ము | లంకెలైన నీమతి వలపు నాసొమ్ము |
అంకెల శ్రీ వేంకటేశ అట్టె నన్నుగూడితివి | యింకా సొమ్ములిచ్చేవు యెన్నియైన నీవు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం