సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నిన్నుదలచి నీపేరు
టైటిల్: నిన్నుదలచి నీపేరు
పల్లవి:
ప|| నిన్నుదలచి నీపేరు దలచి | నన్ను కరుణించితే నెన్నికగాక ||
చరణం:చ|| అధికుని గాచుటేమరుదు నన్ను- | నధముని గాచుట యరుదుగాక నీకు |
మధురమౌ టేమరుదు మధురమూ, చేదు | మధురమౌటే మహిలో నరుదుగాక ||
చ|| అనఘుని గరుణింప నరుదుగాదు నీకు | ఘనపాపుని నన్ను గాచు టరుదుగాక |
కనకము గనకము గానేల, యినుము | కనకమవుటే కడు నరుదుగాక ||
చ|| నెలకొన్న భీతితో నిన్ను జెనకితిగాక | తలకొన్న సుఖినైన దలచనేల నిన్ను |
యెలమితో దిరువేంగళేశుడ నాపాల | గలిగి నీకృప గలుగజేతువుగాక ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం