సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నిత్య పూజలివిగో నెరిచిన నోహో
పల్లవి:

నిత్య పూజలివిగో నేరిచిన నోహో
ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి || నిత్య ||

చరణం:

తనువే గుడియట తలయే శిఖరమట
పెను హృదయమే హరి పీఠమట
కనుగొ్ను చూపులే ఘనదీపములట
తనలోపలి అంతర్యామికిని

చరణం:

పలుకే మంత్రమట
పాదయిన నాలికే కలకలమను పిడిఘంటయట
నలువైన రుచులే నైవేద్యములట
తలపులోపలనున్న దైవమునకు

చరణం:

గమన చేష్టలే అంగరంగ గతియట
తమి గల జీవుడే దాసుడట
అమరిన ఊర్పులే ఆలవట్టములట
క్రమముతో శ్రీ వేంకటరాయునికి

అర్థాలు



వివరణ