సంకీర్తన

రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నిత్యానంద ధరణీధర
పల్లవి:

నిత్యానంద ధరణీధర ధరారమణ
కాత్యాయనీస్తోత్ర కామ కమలాక్ష ||

చరణం:

అరవిందనాభ జగదాధార భవదూర
పురుషోత్తమ నమో భువనేశ
కరుణాసమగ్ర రాక్షసలోక సంహార-
కరణ కమలాధీశ కరిరాజవరద ||

చరణం:

భోగీంద్రశయన పరిపూర్ణ పూర్ణానంద
సాగరనిజావాస సకలాధిప
నాగారిగమన నానావర్ణనిజదేహ
భాగీరథీజనక పరమ పరమాత్మ ||

చరణం:

పావన పరాత్పర శుభప్రద పరాతీత
కైవల్యకాంత శృంగారరమణ
శ్రీవేంకటేశ దాక్షిణ్యగుణనిధి నమో
దేవతారాధ్య సుస్థిరకృపాభరణ ||

అర్థాలు



వివరణ

సంగీతం

పాడినవారు
సంగీతం