సంకీర్తన
రచయిత: తాళ్లపాక అన్నమాచార్య
టైటిల్: నల్లని మేని
టైటిల్: నల్లని మేని
పల్లవి:
ప|| నల్లని మేని నగవు చూపుల వాడు | తెల్లని కన్నుల దేవుడు ||
చరణం:చ|| బిరుసైన దనుజుల పింఛమణచినట్టి | తిరుపు కైదువ తోడి దేవుడు |
సరిపడ్డ జగమెల్ల చక్క ఛాయకు దెచ్చి | తెరవు చూపినట్టి దేవుడు ||
చ|| నీటగలసినట్టి నిండిన చదువులు | తేట పరచినట్టి దేవుడు |
పాటిమాలినట్టి ప్రాణుల దురితపు | తీట రాసినట్టి దేవుడు ||
చ|| గురుతువెట్టగరాని గుణముల నెలకొన్న | తిరువేంకటాద్రిపై దేవుడు |
తిరముగ ధృవునికి దివ్యపదంబిచ్చి | తెరచి రాజన్నట్టి దేవుడు ||
అర్థాలు
వివరణ
సంగీతం
పాడినవారు
సంగీతం